Advertisement Advertisement

ANR National Award to Chiranjeevi BY Amitabh Bachchan,Nagarjuna,Akkineni Family ANR Award to Chiru

 ANR Is A Fatherly Figure To Me, Receiving The ANR Award From Amitabh Bachchan Gives Completeness To My Cinematic Journey: Megastar Chiranjeevi

 
.

ANR Award - Chiranjeevi - Nagarjuna - Amitabh

ANR Award - Chiranjeevi - Nagarjuna - Amitabh

ANR Award - Akkineni Family

In celebration of the legendary actor Akkineni Nageswara Rao (ANR) and his lasting impact on Indian cinema, the ANR National Awards continue to recognize outstanding talent in the industry. Initiated by ANR himself, these awards aim to perpetuate his legacy by honoring individuals who have significantly influenced Indian cinema.

As part of the ANR Centenary celebrations this year, various events and screenings of ANR’s iconic films have been organized to pay tribute to his illustrious career. Additionally, the Government of India unveiled a special commemorative stamp to mark this milestone.

In this notable year, the ANR National Award 2024 was bestowed upon Padma Vibhushan Awardee Shri Chiranjeevi Garu for his remarkable contributions to Indian cinema. Chiranjeevi is the second Telugu artist to receive the prestigious Padma Vibhushan, following ANR, who was honored in 2011.
The ANR Awards function turned out to be a grand event, graced by members of the Akkineni family and esteemed guests. The program commenced with a musical performance by MM Keeravani. Singers paid tribute to ANR by performing his classic songs, evoking cherished memories. The atmosphere became particularly emotional when the last words spoken by ANR from the ICU were played, touching everyone deeply. The final visuals of ANR moved the audience to tears, creating a poignant moment that honored his enduring legacy.

Nagarjuna said, “The three letters ANR mean the world not just to me, but also to my family, friends, fans, and well-wishers. My father believed in a philosophy. It’s not a verse; it’s a concept that comes from the core of his belief. My father believed in humanity, empowering people, family, and friendship in diversity. Most of all, he believed in cinema. Today, people strive to have just a few of these qualities. But he had all of them. That’s why people like him remain a concept and a legend—a legend that lives on. To my mother, he was a devoted husband; to his children, a devoted father; to his friends, a loyalist; and to cinema, he’s a devoted worker. The very place we stand here today is proof of his life and his concept. The ANR Award is an attempt to honor such personalities and to thank them for setting an example for future generations that a true hero is one who shines even after the director says cut.

Today, let me welcome two such personalities, the ABC of Indian cinema: AB and C—the legend who walks, Shri Amitabh Bachchan Ji, and the Megastar, Chiranjeevi. This year is even more special to us because the award has been given to my very dear friend and brother, Padma Vibhushan Chiranjeevi Garu. The award has been presented by another legend whom I admired all my life and who has also been a part of all your lives—our beloved Padma Bhushan and Dadasaheb Phalke Awardee, Shri Amitabh Bachchan Ji. Amit Ji, when you accepted the ANR Award a few years ago, you made the award more prestigious. We thank you now for gracefully accepting to present it to Chiranjeevi Garu; it means the world to us, as this is the centenary year of ANR Garu. Recently, when I saw the film Kalki, directed by Nag, which released in theaters, I called up Amit Ji and said, ‘Amit Ji, my original mass hero is back.’ And from the other side on the phone, I heard his hearty laughter. It went on for five seconds, and I felt so good about it. Sir, I was so thrilled to see you in your original avatar. It made me nostalgic because the evergreen ‘angry young man’ image is deeply etched in our minds, even after all these years. Your portrayal of Aswathama gave us the same adrenaline rush. Your screen presence, your magnetism, your impact are simply untouchable. Amit Ji, as movie lovers, we are all eternally grateful to you for all the characters you portrayed to entertain us. Amit Ji is also a brand ambassador for many humanitarian and social causes like polio eradication and hepatitis awareness, along with UNICEF, the Swachh Bharat Mission, and the Beti Padhao Beti Bachao initiative for the Government of India, among many others. Amit Ji, we salute you for your social initiatives. I just want to say one thing about Amitabh Ji: excellence is something most artists like us aspire to achieve, and that excellence is exemplified by Amit Ji.

Talking about my dear friend Chiranjeevi Garu, I have fond memories with him. Everyone knows about his films; his hits, super hits, and the records he has broken are nothing short of extraordinary. Recently, he was even featured in the Guinness Book of World Records. I remember well—back in 1985, when I was thinking about entering the film industry, Chiranjeevi and team were shooting a song right here at Annapurna Studios. My father called me over and said, ‘Chiranjeevi is dancing inside on that floor; go take a look. If you want to get into films, you might as well learn a bit of dance.’ Radha was also there. Watching him dance with such grace and charisma left me in awe. I thought to myself, ‘Can I ever dance like that?’ That’s when I decided to make my own mark in other way. He is such a warm and hospitable person.

When we were giving the ANR Award a few years back, there was a protocol I had to maintain. We could only have so many people on stage. I asked Chiranjeevi Garu to come for the event, and he obeyed. I told him about the protocol that he couldn’t be invited on stage. He said he would sit in the front row and watched the entire award function from there. He asked one thing: whether he could felicitate Amitabh with a shawl. I said yes. I just wanted to mention what a humble person he is. I can’t talk about his status; we all know the spectacular journey of Chiranjeevi Garu in his films. Likewise, his invaluable charity activities—his blood bank has saved many people and helped many in need. During COVID, from his Chiranjeevi Charitable Trust, he showed a path to cinema workers. I remember that very clearly. My father always used to tell us one thing: if you are taking something from society, you must always give back to society. Both Chiranjeevi Garu and Amitabh Ji walked this path so beautifully. God bless you.

The bond Amit Ji and Chiranjeevi Garu share is absolutely wonderful. Amit Ji famously calls Chiranjeevi the king of Indian cinema, which is so true considering Chiranjeevi’s sway over the audience. So, it’s an absolute honor to have both of them here on stage once again. How do I express what these legends—Amitabh Ji and Chiranjeevi Garu—mean to cinema? I have only one apt expression: the ABC of Indian cinema.

It’s a matter of great joy for all of us that the ANR Award is being presented to Chiranjeevi Garu by Amit Ji today. Thank you both for being here. I especially thank Keeravani Garu for the emotional tribute he paid to my father. The Telugu people will always cherish this. We are so happy to have Shri Subbarami Reddy Garu, a dear friend of my father, who has always been a part of this award and the family. The presence of so many friends, family, colleagues, journalists, and media persons to witness this occasion is heartwarming. I welcome you all on this very special occasion, and I thank each one of you for joining us here and making this moment more memorable. ANR lives on.”

T.Subbiramireddy said, “Greetings to everyone present. Nagarjuna is truly extraordinary. I share a strong bond with ANR. His love is vast, like the Himalayas, and his wisdom is profound. Even in his absence, he lives in my heart and visits me in my dreams. When he received the Dadasaheb Phalke Award, he expressed a desire for the ANR Award to achieve similar recognition. I have been honored to serve as Chairman of the National Film Awards twice, but it is a special privilege to chair the ANR Award. Together, we have honored stalwarts like Lata Mangeshkar, Devanand, and Amitabh Bachchan. This year, I am thrilled to present the award to another giant, Chiranjeevi, who shines in everyone’s hearts.”

Amitabh Bachchan said, “It is very difficult to stand here and say anything after what we’ve just seen, heard, and observed. I must express my extreme gratitude to the ANR Foundation, Nagarjuna, and the entire family for giving me this deep honor and privilege this evening. I want to express my gratitude to Nag, the foundation, and the entire family for bringing to life the legacies that we had the privilege to observe and see—legacies that walked on this earth, this earth of Telugu cinema and the entire film industry—and gave us so much happiness, joy, entertainment, and culture. It is very difficult for anyone to stand here and match ANR’s contribution to Indian cinema. Nag, to you and your family, I want to express my gratitude for living up to the legacy that your respected father left for all of us.

I’m reminded of a poem my father wrote called “The Last Will.” He talked about how his friends had been telling him, “You must write a will. What are you going to leave for your sons?” In today’s time, the kind of life we are living means even a son has to go to court to prove that he is his father’s son. My father then says in the poem that whatever he has, he hasn’t been able to leave any material wealth for his sons.

The line I wish to share today is from that poem, which is in Hindi: “Mere Bethe, Bothe Honese Mere Utharaadhikaari Nahee Honge… Jo Mere Utharaadhikari Honge Wo Mere Bethe Honge.” My sons, just because you are my sons doesn’t mean that you will be my inheritance; those who determine my inheritance will be my sons. And now, prove that you and your family are the true inheritors and true sons of this great personality, Shri Nageswara Rao, who has adorned our film industry.

I’m deeply honored that you’ve chosen me to honor my dear friend, my colleague Chiranjeevi. Whenever I ask him for something, he’s always been there for me. I appreciate all that you have done for me, including giving me a part in your film, and also Nag for giving me a part in your film, and Nag Ashwin for giving me a part in your film. Now I proudly say that I’m a member of the Telugu Film Industry. I wish to thank Chiranjeevi for his friendship, concern, love, affection, humility, and hospitality. He sent me so much lunch today that I could have fed the entire hotel. Please treat me as a member of the Telugu Film Industry from now on.”

Chiranjeevi said, “Hello everyone. It brings me immense joy to receive this award amidst your applause. Before that, I want to thank my Guru, my mentor, and source of inspiration, Shri Amitabh Ji. Whenever something good happens to me, or any occasion occurs in our family, or I receive awards like this, he is the first person to send a message, good wishes, and blessings. Sometimes, at our request, he makes his presence felt at these events. I feel incredibly fortunate to have such a prominent figure of India here with me as I receive this award.

When I was awarded the Padma Bhushan Award, the entire industry celebrated me, and he was the chief guest. I can’t forget the words he spoke. As you’ve seen in the video, he referred to me as Chiranjeevi, the king of Indian cinema. I was taken aback; I had no words to say. I became completely speechless and overwhelmed. I didn’t know if I had thanked him that day. So today, I want to express my gratitude, keeping that incident in mind, for the words from the Baadshah and Shahenshah of Indian Cinema, Shri Amitabh Ji. Thank you so much for encouraging me with your words; they mean a lot to me. Each moment with him has been incredibly valuable.

When I first acted in my Hindi film, Pratibandh, in 1990, I was eager to show it to my only idol, Amitabh Ji. We watched it together, and I was so touched by his reaction. He came to me and said, “Powerful performance, Chiranjeevi, and it’s a very purposeful film.” Those words gave me immense energy. I felt like a child that day.

For every occasion at his house, and for every occasion at mine, he makes it a point to be present and bless us. That’s how we’ve grown together. During the time of Sye Raa, we all wanted Shri Amitabh Bachchan to play a cameo as my Guru. Everyone hesitated about how to approach him, but I took the initiative and sent a message. He responded immediately, asking what I needed. When I discussed the character with him, he said he would do it, and we all felt so happy.

When I inquired about arrangements, he insisted that I should not do anything; he would take care of all the expenses. He finished his character in record time and didn’t allow me to do anything for him. On the last day, I hesitantly asked him how to fulfill the formalities, and he simply refused, showing his love and affection that way. From the bottom of my heart, I am deeply indebted to you for a lifetime. What can I say or give other than humbly saying thank you so much? May God grant you enormous strength and health. Long live Amitabh Ji. Thank you for being here. We are all happy with your presence.

In Telugu, we have a saying: “You must win at home before winning elsewhere.” I feel like I’ve won at home after winning this award. During my journey as an actor, I often wondered if my father would ever praise me, but he rarely did. However, my mother told me how much he loved my acting and how much he used to praise me. My father believed it was not good to overly praise children.

The opportunity to succeed in this industry came for me during Vajrotsavam Celebrations. When everyone gathered to present me with the Legendary Award, I felt incredibly happy. But when some didn’t seem pleased, I didn’t think I deserved it. That day, I didn’t feel like I had won at home. Today, receiving the Great ANR Award from Amitabh Bachchan, and hearing my friend say I have all the qualifications, makes me feel like I have won both at home and elsewhere.

I overreacted when Nag and Venkat visited my home to invite for the function. Regardless of how many awards I receive, when my loved ones recognize me, that feels like the true achievement. That’s how I feel today, from the bottom of my heart.

The reason I wanted my mother to sit in the front row is that she is a very senior fan of ANR. She was pregnant with me in Mogalthur when ANR’s film was released. My arranged for a rickshaw. There was a minor accident during that time, yet she insisted on watching the film. I feel my admiration for ANR came through her. She loved his dance, and I grew up dancing to his songs. ANR was my inspiration for dance. I can never forget what he spoke in an interview. ‘I might have been the first dancer in Telugu, but Chiranjeevi brought grace to that dance.’

He encouraged me to shift here in Hyderabad, when I came to shoot in the same studio. Thanks to his efforts, we are in such a good position today. He invited me as a guest for the 100 days function of “College Bullodu.” When I was following him, the audience cheered for us. But, he told me that the audience actually cheered. That’s how he used to encourage me.

Working in “Mechanic Alludu” taught me many lessons in life. He was like a walking encyclopaedia for me. There was always a romantic touch in his words, which is why he remains young at heart. When I was away from the industry, I used to share things with him, while he was resting on his bed. He was a fatherly figure to me. Later, that love transitioned to Nagarjuna. In terms of health, Nagarjuna has been an inspiration. He is not just my friend and brother but also a doctor who shares health tips with me. The principles Nagarjuna taught me are the reason I look so young. He is a great blessing that God has given me. Their family feels like my own.

Thank you all. Receiving this award, after such greats like Devanand, Lata Mangeshkar, Amitabh Bachchan, Shyam Benegal, Rekha, and K Balachander gives completeness to my cinematic journey. I cherish this moment for a lifetime. I’m very happy that Subbarami Reddy’s committee selected me, and I extend my gratitude to them as well.”


ANR Award - Chiranjeevi - Nagarjuna - Amitabh

ఏయన్నార్‌ అవార్డు నాకు దక్కడం నా పూర్వజన్మ సుకృతం. బిగ్ స్టార్ ఆఫ్ ఇండియా అమితాబచ్చన్ గారి చేతుల మీదుగా ఈ అవార్డుని అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ అవార్డు రావడం నా సినీ జీవితానికి ఒక పరిపూర్ణత ఏర్పడింది: పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి

'ఏయన్నార్‌ అవార్డు నాకు దక్కడం నా పూర్వజన్మ సుకృతం. బిగ్ స్టార్ ఆఫ్ ఇండియా అమితాబచ్చన్ గారి చేతుల మీదుగా ఈ అవార్డుని తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మై గురు, మై మెంటర్ మై ఇన్స్పిరేషన్ అమితాబచ్చన్ గారికి ధన్యవాదాలు. బిగ్ స్టార్ ఆఫ్ ఇండియా అమితాబచ్చన్ గారి చేతుల మీదుగా ఈ అవార్డుని తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది' పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి. ఏఎన్నార్‌ జాతీయ అవార్డు ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌, మెగాస్టార్ చిరంజీవికి అవార్డును ప్రదానం చేశారు. అతిరథ మహారథులు హాజరైన ఈ వేడుక కన్నుల సాగింది.

పద్మ విభూషణ్, ఏయన్నార్‌ అవార్డు గ్రహీత, మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. చాలా హృద్యంగా జరుగుతున్నటువంటి ఈ చక్కటి సభలో మీ కరతాల ధ్వనుల మధ్య ఈ అవార్డు తీసుకోవడం నాకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. మై గురు మై మెంటర్ మై ఇన్స్పిరేషన్ అమితాబచ్చన్ గారికి ధన్యవాదాలు. బిగ్ స్టార్ ఆఫ్ ఇండియా అమితాబచ్చన్ గారి చేతుల మీదుగా ఈ అవార్డుని తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు జరిగిన సన్మాన కార్యక్రమంలో అమితాబచ్చన్ గారు 'చిరంజీవి కింగ్ ఆఫ్ ఇండియన్' సినిమా అని చెప్పడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. నిజానికి ఆ మాట విని షేక్ అయ్యాను. ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఐయామ్ ఓవర్ వెల్మ డ్. ఆ రోజు నేను ఆయనకి థాంక్స్ చెప్పానో లేదో కూడా తెలీదు. ఒక డిఫరెంట్ ప్లేన్ లో ఉన్నాను. బాద్షా ఆఫ్ ఇండియన్ సినిమా అమితాబచ్చన్ గారి నుంచి ఆ మాటలు రావడం ఎంతో ఆనందం. థాంక్యూ సో మచ్ బచ్చన్ జి. మీ మాటలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. మితాబచ్చన్ గారితో గడిపిన ప్రతి క్షణం నాకు ఎంతో విలువైనది. నేను హిందీలో ప్రతిభంద్ సినిమా చేసినప్పుడు కేవలం అమితాబచ్చన్ గారికి మొదటిగా చూపించాను. ఆయన కోసం స్పెషల్ గా ప్రొజెక్షన్ వేసాం. మా ఇద్దరమే ఆ సినిమా చూశాం. సినిమా అంత చూసి ఆయన 'వెరీ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్. వెరీ పర్పస్ ఫుల్ ఫిలిం. వెరీ గుడ్ జాబ్. ఆల్ ద వెరీ బెస్ట్' అని చెప్పారు. ఆ మాటలు నాకు ఎంతో ఎనర్జీ ఇచ్చాయి. మా ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయి. అమితాబచ్చన్ గారు సైరా సినిమాలో ఒక కామియో రోల్ చేశారు. ఆయనకి ఎలా అడగాలో తెలియక ఒక చిన్న మెసేజ్ పెట్టాను. ఆ మెసేజ్ చూసి వెంటనే ఆ క్యారెక్టర్ చేస్తానని చెప్పారు. సినిమా అంతా పూర్తయిన తర్వాత ఫార్మాలిటీస్ గురించి అడిగాను. 'నీపై ఉన్న ప్రేమతో చేశాను. యు ఆర్ మై ఫ్రెండ్. ఫార్మాలిటీస్ గురించి మాట్లాడొద్దు' అని చెప్పారు. క్షణం మర్చిపోలేను. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దేవుడ్ని కోరుకుంటున్నాన. లాంగ్ లీవ్ అమితాబ్ జి. థాంక్యూ సో మచ్.

తెలుగులో ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని ఓ నానుడి ఉంది. నా విషయంలో రచ్చ గెలిచి ఇప్పుడు ఇంట గెలిచాను ఏమో అనిపిస్తోంది. నటుడిగా నేను ఎదుగుతున్న సమయంలో బయట ప్రేక్షకులు, సన్నిహితుల నుంచి ప్రశంసలు వచ్చేవి. అయితే ఇంటికి వెళ్లినప్పుడు మా నాన్న సినిమాలు చూసి పొగుడుతారేమో అని అనుకునేవాణ్ని. మా నాన్నకు నటన అంటే చాలా ఇష్టం. అలాంటి మా నాన్న నన్ను ఎందుకు పొగడరు అనిపించేది. ఓ రోజు ఇంటికి వెళ్లినప్పుడు నా కవర్‌ పేజీలతో కొన్ని పుస్తకాలు చూస్తున్నారు. నేను వెళ్లేసరికి తీసి పక్కన పడేశారు. ఫొటోలు బాగున్నాయిరా అని ఓ మాట అంటారేమో అని అనుకున్నాను. కానీ ఆయన అలా అనలేదు. లోపలకు అమ్మ దగ్గరకు వెళ్లి.. ‘ఏంటమ్మా నాన్న ఎప్పుడూ నా గురించి ఓ మాట అనరు, బాగుందని కూడా చెప్పరు’ అని అడిగాను. బయట రచ్చ ఎంత గెలిచినా సరే.. ఇంట గెలవడం లేదు అనిపిస్తోంది అని అన్నాను. దానికి అమ్మ ‘లేదురా నాన్న చాలా పొగుడుతారు. ఏం చేశాడు నా కొడుకు, అదరగొట్టేశాడు’ అని అంటుంటారు అని చెప్పింది. మరి నా దగ్గర ఆ మాటలు అనొచ్చు కదా అని అమ్మను అంటే ‘బిడ్డల్ని తల్లిదండ్రుల్ని పొగడకూడదు. అది వారికి ఆయుక్షీణం’’ అని అమ్మ చెప్పింది. సినిమా పరిశ్రమలో నేను తొలుత రచ్చ గెలిచాను. నా ఇల్లు అనుకునే పరిశ్రమలో నాకు ఆ అవకాశం టాలీవుడ్‌ వజ్రోత్సవాల సమయంలో వచ్చింది. లెజండరీ పురస్కారం ప్రదానం చేశారు. ఆ సమయంలో చాలా ఆనందమేసి ధన్యుణ్ని అనుకున్నా. కానీ ఆ రోజు కొన్ని ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో కొందరు హర్షించని ఆ సమయంలో ఆ పురస్కారాన్ని తీసుకోవడం సముచితం అనిపించలేదు. అందుకే ఆ రోజు ఆ అవార్డుని ఓ క్యాప్సుల్‌ బాక్స్‌లో పడేసి నాకు అర్హత ఎప్పుడు వస్తుందో అప్పుడు తీసుకుంటాను అని చెప్పాను. అంటే ఆ రోజు నేను ఇంట గెలవలేదు. ఈ రోజు ది గ్రేట్ ఏఎన్నార్‌ అవార్డును ది గ్రేట్ అమితాబ్ బచ్చన్ గారి చేతులు మీదగా అందుకున్న రోజున ఇప్పుడు అనిపిస్తోంది.. ‘నేను ఇంట గెలిచాను.. రచ్చ గెలిచాను’ అని. అందుకే ఈ పురస్కారం గురించి చెప్పడానికి నాగార్జున, వెంకట్ ఇంటికి వచ్చినప్పుడు నేను చాలా ఆనందించాను. నాకు పద్మభూషణ్‌, పద్మ విభూషణ్‌, గిన్నిస్‌ బుక్‌లో స్థానం.. ఇలాంటివి ఎన్ని వచ్చినా ఈ అవార్డు విషయంలో నా భావోద్వేగం వేరుగా ఉంది. నా వాళ్లు నన్ను గుర్తించి నాకు అవార్డు ఇస్తుండటం నాకు గొప్ప విషయంగా అనిపించింది. అందుకే నాగార్జునతో ఇది నాకు అన్ని పురస్కారాలకు మించిన ప్రత్యేకమైన అవార్డు అని చెప్పా. ఇదే మాట స్టేజీ మీద చెప్పాలి అనుకున్నాను. ఇప్పుడు చెప్పాను.

ఈ వేడుకలో అమ్మని ముందు సీటు లో కూర్చోబెట్టడానికి ప్రధాన కారణం.. అమ్మ నాగేశ్వరరావు గారికి సీనియర్ మోస్ట్ ఫ్యాన్. నేను కడుపులో ఉన్నప్పుడు నాగేశ్వరావు గారి సినిమా విడుదలైంది. ఆ సినిమా ఎలాగైనా చూడాలని నాన్న గారితో చెప్పింది. థియేటర్ కి వెళ్లడానికి ఒక జట్కా బండిని ఏర్పాటు చేశారు. జట్కా బండి లో వెళ్తున్నప్పుడు అది కాస్త దారి తప్పి కాస్త పక్కకు దొర్లింది. నాన్న చాలా కంగారు పడ్డారు. ఇంటికి వెళ్లి పోదాం పద అని చెప్పారు. అయినప్పటికీ అమ్మ సినిమాకి వెళ్దామని పట్టుబట్టింది. ఆ సినిమా అమ్మ చూసింది. తర్వాత ఒకటి రెండు నెలల్లో నేను బయటికి వచ్చాను. అమ్మకి నాగేశ్వరరావు గారి సినిమాలు అంటే అంత ఇష్టం. అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాల్లో డాన్స్ లు అంటే నాకు చాలా ఇష్టం. నడవవే వయ్యారి.. అయ్యయ్యో బ్రహ్మయ్య ..దసరా బుల్లోడు సాంగ్స్.. ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టం. ఆ పాటలు వచ్చినప్పుడు నా పంధాలో డాన్స్ చేసే వాడిని. నాకు డాన్స్ లో ఇన్స్పిరేషన్ నాగేశ్వరరావు గారు. ఆయన డ్యాన్స్ చూస్తూ ముందుకు వెళ్లాను. నాగేశ్వరరావు గారు స్వతహాగా నా డాన్స్ ని మెచ్చుకుంటూ మాట్లాడడం నాకు ఎంతో నాకు ఎన్నో గొప్ప అవార్డులతో సమానం. ఎన్నో సందర్భంలో ఆయన నా గురించి ప్రస్తావించారు.

మేము మద్రాస్ నుంచి ఇక్కడికి షూటింగ్ కి వచ్చేటప్పుడు ఆయన మమ్మల్ని కలిసి మీరంతా మద్రాస్ నుంచి ఇక్కడికి రావాలని కోరేవారు. సినిమా పరిశ్రమ ఇక్కడికి తరలిరావాలని ఆయన చేసిన ప్రయత్నం ఆయన చేసిన కృషి ఈరోజు మనమంతా అనుభవిస్తున్నాం. నాగేశ్వరావు గారు ఎంతో పెద్ద మనసుతో నాలాంటి వారిని ఎంకరేజ్ చేశారు. ఆయన గొప్ప మనసుకి ఈ సందర్భంగా ఆయనకి నివాళులర్పిస్తున్నాను. ఆయనతో మెకానిక్ అల్లుడు సినిమా చేసే గొప్ప అవకాశం నాకు వచ్చింది. అది నాకు గొప్ప ఎక్స్పీరియన్స్. ఆయన నడిచి వచ్చే ఒక ఎన్సైక్లో పీడియాలా అనిపించేది. ఆయన ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు . ఎన్నో సందేహాలని నివృత్తి చేసేవారు. ఆయన చాలా సరదా మనిషి. చాలా సరదాగా ఉంటారు. అలనాటి ముచ్చట్లు పంచుకుంటారు. ఆయన నాకు ఒక ఫాదర్లీ ఫిగర్ లో ఉండేవారు. వారి కుటుంబ సభ్యులందరికీ తెలుసు నేను ఆయన్ని ఎంతగా ప్రేమిస్తానో తెలుసు. తర్వాత ఆ ప్రేమ నాకు నాగర్జున మీద కలిగింది. నాగార్జున నాకు ఎంతో ఇన్స్పిరేషన్ ఆరోగ్య సూత్రాలు పాటించడంలో ఎక్సర్సైజ్ చేయడంలో ఎప్పుడూ యంగ్ గా ఉండడానికి ఆయన తీసుకునే శ్రద్ధ శక్తులు నాకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. వాటిని అలవర్చుకుంటాను ఆచరిస్తుంటాను. నాకు నాగార్జున ఒక స్నేహితుడు, బ్రదరే కాదు.. నాకు ఆరోగ్య సూత్రాలు తెలిపే డాక్టర్ కూడాను. ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అద్భుతమైన స్నేహితుడు నాగార్జున. అఖిల్ నాకు మరో బిడ్డ లాగా పెదనాన్న అని పిలుస్తున్నప్పుడు నాకెంతో ఆనందంగా ఉంటుంది. వాళ్ళ పిల్లలందరూ మా కుటుంబ సభ్యులు అనిపిస్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ వాళ్ళు చూపించే ప్రేమకు నేను దాసుడిని. నాగ్ లాంటి స్నేహితుడిని నేను జీవితాంతం పదిలంగా దాచుకుంటాను.

దేవానంద్, లతా మంగేష్కర్, అమితాబచ్చన్ గారు ఇలా ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులకి వచ్చిన ఈ ఏఎన్ఆర్ ప్రతిష్టాత్మకమైన అవార్డు నాకు దక్కడం నా పూర్వజన్మ సుకృతం. ఈ అవార్డు రావడం నా సినీ జీవితానికి ఒక పరిపూర్ణత ఏర్పడిందని భావిస్తున్నాను. నాగేశ్వరరావు గారి ఆశీస్సులు మనందరిపై నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఈ క్షణాన్ని జీవితాంతం నా మనసులో పదిలపరుచుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన నాగార్జున గారికి ధన్యవాదాలు. ఈ సందర్భంగా టి సుబ్బిరామిరెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జైహింద్' అన్నారు

బిగ్ బి అంతా బచ్చన్ గారు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అక్కినేని నాగేశ్వరరావు ఫౌండేషన్, నాగార్జున, అక్కినేని ఫ్యామిలీ అందరికీ నా కృతజ్ఞతలు. ఇండియన్ సినిమాకి నాగేశ్వరరావు గారు చేసిన సేవలు అనితర సాధ్యం. డియన్ సినిమాకి నాగేశ్వరరావు గారి కాంట్రిబ్యూషన్ ని ఎవరు మ్యాచ్ చేయలేరు. నాగేశ్వరరావు గారి లెగిసిని కంటిన్యూ చేస్తున్న నాగార్జునకి నా అభినందనలు. ఐ యాం వెరీ గ్రేట్ ఫుల్ టు యు నాగ్. మై డియర్ ఫ్రెండ్ చిరంజీవి గారికి ఈ అవార్డును నేను ప్రధానం చేయడం నాకు చాలా గౌరవంగా ఉంది. నేను ఎప్పుడు ఏది అడిగినా ఆయన సిద్ధంగా ఉంటారు. థాంక్యూ చిరంజీవి గారు. నేను చిరంజీవి గారి సినిమాలో నటించాను. నాగ్ అశ్విన్ సినిమాలో నటించాను. నేను కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పార్ట్ అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది. చిరంజీవి గారి ఫ్రెండ్షిప్ కి థాంక్యూ సో మచ్. చిరంజీవి గారి ప్రేమ అభిమానం ఆప్యాయతకి ధన్యవాదాలు. ఇకపై నన్ను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మెంబర్ గా తీసుకుంటారని కోరుతున్నాను. నాగ్ అశ్విన్ నెక్స్ట్ టైం తన ఫిలిమ్ లో తీసుకోవాలని కోరుతున్నాను(నవ్వుతూ) అందరికీ థాంక్యూ సో మచ్ 'అన్నారు

కింగ్ అక్కినేని నాగార్జున గారు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఏయన్నార్‌ ఈ మూడు అక్షరాలే నాకు ప్రపంచం. నాకే కాదు మా కుటుంబం, స్నేహితులు, అభిమానులు అందరికీ. మా నాన్న గారు హ్యుమానిటీని నమ్మారు. మనుషుల్ని నమ్మారు. న్నిటికంటే ముఖ్యంగా సినిమాని బిలీవ్ చేశారు. అభిమానులు, ప్రేక్షకులు మనసులో చిరస్థాయిగా ఒక లెజెండ్ గా నిలిచారు. భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిల్చే అలాంటి గొప్ప వ్యక్తులని గౌరవించడం ఏయన్నార్‌ అవార్డు ముఖ్య ఉద్దేశం. ఈరోజు అలాంటి గొప్ప వ్యక్తులు ఇద్దరు, ఇండియన్ సినిమా ఏ బి సి.. అమితాబచ్చన్ జి, మెగాస్టార్ చిరంజీవి గారిని ఆహ్వానిస్తున్నాను. ఈ ఏడాది నా డియర్ ఫ్రెండ్, పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి అవార్డు ఇవ్వడం ఎంతో ప్రత్యేకం. ఈ అవార్డుని నేను ఎంతగానో ఆరాధించే పద్మ విభూషణ్ అమితాబచ్చన్ గారు ప్రజెంట్ చేయడం ఇంకా స్పెషల్. కొన్నేళ్ల క్రితం అమితాబచ్చన్ గారు ఏఎన్నార్ అవార్డుని అందుకోవడం లు అవార్డు ప్రతిష్టని మరింతగా పెంచింది. ఈరోజు చిరంజీవి గారికి అవార్డు ప్రధానం చేయడానికి అమితాబచ్చన్ గారు రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఏఎన్ఆర్ శతజయంతి సందర్భంగా ఇది మాకు ఎంతో ప్రత్యేకం. రీసెంట్ గా కల్కి సినిమా చూశాను. అమితాబచ్చన్ గారిని అశ్వద్ధామ చూసినప్పుడు మా ఒరిజినల్ మాస్ హీరో ఇస్ బ్యాక్ అనిపించింది. ఇదే విషయం ఆయనకి కాల్ చేసి చెప్పాను. ఆయన ఎంతో ఆనందంగా నవ్వారు. అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అమితాబచ్చన్ గారి స్క్రీన్ ప్రజెంట్, మేనరిజం, ఇంపాక్ట్ సింప్లీ అండ్ అన్ టచబుల్. అమితాబ్ బచ్చన్ గారు ఎన్నో సామాజిక కార్యక్రమాలకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నారు. హ్యాట్సాఫ్ అమితాబచ్చన్ గారు. మై డియర్ ఫ్రెండ్ చిరంజీవి గారితో నాకు ఎన్నో బ్యూటిఫుల్ మెమోరీస్ ఉన్నాయి. ఆయన సినిమాలు గురించి మీ అందరికీ తెలుసు ఆయన ఇట్లు సూపర్ హిట్లు బ్రేక్ చేసిన రికార్డులు అంతా ఇంతా కాదు. ఈమధ్య గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా ఎక్కారు. నేను సినిమాల్లోకి వద్దాం అనుకున్నప్పుడు.. నాన్నగారు ఒకసారి అన్నపూర్ణ స్టూడియోస్ లో చిరంజీవి గారి షూటింగ్ జరుగుతుంటే ఆయన డాన్స్ ని చూడమని నాకు చెప్పారు. అప్పుడు రెయిన్ సాంగ్ జరుగుతుంది. చిరంజీవి గారి డాన్స్, గ్రేస్ చూసి నాకు కొంచెం గుబులు పుట్టింది. ఆయనలాగా డాన్స్ చేయగలనా అనిపించింది. అలా ఆయనతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. చిరంజీవి గారి స్పెక్టాక్యులర్ సినిమా జర్నీ మనందరికీ తెలుసు. అలాగే ఆయన వెలకట్టలేని సామాజిక సేవ కార్యక్రమాలు ఎన్నో చేశారు. చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ఎంతోమంది ప్రాణాలను కాపాడింది. కోవిడ్ టైంలో ఫిలిం వర్కర్స్ అందరికీ ఒక దారి చూపించారు. నాన్నగారు ఎప్పుడు ఒక మాట చెప్తుండేవారు. మనం సొసైటీ నుంచి ఏదైనా తీసుకున్నప్పుడు మళ్లీ తిరిగి ఇవ్వాల్సి బాధ్యత మన మీద ఉంటుందని. చిరంజీవి గారు, అమితాబచ్చన్ గారు అదే చేసి చూపించారు. అమితాబ్ బచ్చన్ గారు చిరంజీవి గారిని కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అని పిలిచారు.అది ముమ్మాటికి నిజం. ఇలాంటి ఈ వేదికపై ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది అమితాబచ్చన్ గారు ఏఎన్ఆర్ అవార్డు ని చిరంజీవి గారిని చిరంజీవి గారికి ప్రజెంట్ చేయడం మా అందరికీ ఎంతో సంతోషం. కీరవాణి గారు మా ఫాదర్ జర్నీ ని వారి మ్యూజిక్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. థాంక్యూ కీరవాణి గారు. ఈ వేడుకకి విచ్చేసిన స్నేహితులు, సినీ పరిశ్రమ ప్రముఖులు, మీడియా మిత్రులు అందరికీ స్వాగతం. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. థాంక్యూ ఆల్. ఏఎన్ఆర్ లీవ్స్ ఆన్' అన్నారు

టి సుబ్బిరామిరెడ్డి గారు మాట్లాడుతూ. నాగార్జున ఎక్స్ ట్రార్డినరీ పర్శన్. ఎంత అద్భుతంగా మాట్లాడారు. ఎంత గొప్పగా ఈ అవార్డు వేడుకని ఏర్పాటు చేశారు. నాగార్జునని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దాదాపు 60 సంవత్సరాల నుంచి నాకు అక్కినేని నాగేశ్వరరావు గారికి అనుబంధం ఉంది. ఆయన నటన హిమాలయాల శిఖరాలకు వెళ్లింది. ఆయన జీవితం అద్భుతం అమోఘం. ఆయన ఎప్పుడూ నా గుండెల్లో జీవిస్తూనే ఉంటారు. నాగేశ్వరావు గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినప్పుడు నాతో ఒక మాట చెప్పారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎంత ప్రతిష్టాత్మకంగా ఉందో ఏఎన్ఆర్ అవార్డు కూడా అంత ప్రతిష్టాత్మకంగా ఉండాలని నన్ను చైర్మన్ గా చేశారు నేను రెండుసార్లు చైర్మన్ గా ఉన్నాను . ఈ అవార్డు కమిటీ చైర్మన్ ఉండడం నాకు ఎంతో సంతోషం, గొప్ప గౌరవం. ఎంతో మంది లెజెండ్స్ కి అవార్డ్స్ ఇస్తూ వచ్చాం. ఈసారి మరో గొప్ప లెజెండ్ చిరంజీవి గారికి అవార్డు ఇవ్వడం మాకెంతో గౌరవంగా ఉంది. చిరంజీవి గారు అందరి గుండెల్లో చిరంజీవిగా ఎప్పుడు వెలుగుతూనే ఉంటారు. చిరంజీవి గారు గర్వాన్ని జయించిన గొప్ప మనిషి. అలాగే అలాగే అమితాబ్ బచ్చన్ గారు కూడా మహోన్నతమైన వ్యక్తి. ఎంత స్టార్డమ్ ఉన్నప్పటికీ గొప్ప మానవత్వంతో ఉంటారు. చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. చరిత్రలో ఎవరు ఇలా చేయలేదు. ఎంతోమంది ఎంతోమందికి స్ఫూర్తిని ఇచ్చారు అలాంటి చిరంజీవి గారికి ఏఎన్నార్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. థాంక్యూ టు ఆల్' అన్నారు.

ఈ అవార్డు వేడుకలో ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ప్రత్యేకంగా సన్మానించారు. హీరోలు వెంకటేష్, రామ్ చరణ్, నాని, సిద్దు జొన్నలగడ్డ, సుధీర్ బాబు, దర్శకులు రాఘవేంద్రరావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను, నాగ్ అశ్విన్, చందూమొండేటి, నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీదత్, శ్యాం ప్రసాద్ రెడ్డి, టీజీ విశ్వప్రసాద్, సునీల్ నారంగ్, స్వప్న దత్, హీరోయిన్స్ రమ్యకృష్ణ, శ్రీలీల, నటులు ప్రకాష్ రాజ్, మురళిమోహన్, అలీ, రాజేంద్రప్రసాద్, రైటర్ విజయేంద్రప్రసాద్, అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు అనేక మంది ప్రముఖులు పాల్గొన్న ఈ వేడుకు మహా అద్భుతంగా జరిగింది.

Copyright© -Old Websites from 2011 - TeluguClix.com - 2018 to 2025 Privacy Policy , Disclaimer , About US - Contact , DMCA Policy