Advertisement Advertisement
Man of Masses - NTR Heartfelt Gratitude thanks Note to Fans, movie Team, film Audience, Distributors, and Exhibitors for Making Devara film a huge Blockbuster Success.
Man of Masses Jr NTR's Devara film directed by Koratala Siva, had its grand release on Sep 27th 2024. The movie garnered a blockbuster huge response from both the audience and fans. The cinema features Saif Ali Khan as Bhaira, with actress Janhvi Kapoor playing the female lead. Presented by Kalyan Ram under the banner of NTR Arts, it is produced by Sudhakar Mikkilineni and Kosaraju Harikrishna, with production handled by NTR Arts and Yuvasudha Arts. The film's high-quality production values, engaging narrative, and strong promotional campaigns contributed to its massive opening at the box office. It collected over 500 crores+, generating significant profits.
This tremendous success brought NTR great joy. He expressed his gratitude to the audience, fans, team, and media for this remarkable achievement in a heartfelt thank-you note. In his message, the actor began by acknowledging his fellow cast members, such as Saif Ali Khan, Janhvi Kapoor, Prakash Raj, Srikanth, and others, highlighting their talent in bringing their characters to life. He also praised director Koratala Siva for his outstanding vision and for inspiring the team. NTR expressed appreciation for the talented technicians and congratulated the distributors and exhibitors who were essential to the film's successful run. He also thanked producers Sudhakar Mikkilineni and Harikrishna Kosaraju for their important contributions to the film’s success.
In conclusion, he conveyed his heartfelt gratitude to his fans around the world and to the audience who truly enjoyed the film. NTR wrote, "My heart is filled with immense gratitude for the overwhelming response to "Devara Part 1". This movie holds a special place in my heart and seeing the outpouring of love from around the world makes it even more special. First and foremost I want to thank my fellow cast members; Saif Sir, Janhvi, Prakash Raj Garu, Srikanth Garu and all the other actors & artists for breathing life into their characters so ably and giving our story wings. A huge thanks to my captain of movie , Koratala Siva for his vision of conceiving this world and this tale. His leadership guided us through every step of making this magnificent vision a reality. Anirudh,what can I say? The world is talking about what he has done for the movie. Rathnavelu Sir made each frame stunning. Sabu Sir for the great production design, Yugandhar Garu for the VFX and Sreekar Prasad Garu for the edit and all the technicians for shaping the product in the best possible way."
"Congratulations and thanks to all the distributors and exhibitors who have been part of making our film's spectacular run in theatres. A heartfelt thank you to all the well-wishers from the film fraternity for your love and support. Thank you to the media across the nation for your continued support and coverage. Grateful for the love and encouragement you have extended for Devara. Lastly, a big thank you to our producers, Sudhakar Mikkilineni Garu and Harikrishna Kosaraju Garu, who made this project possible and helped it stand tall. Thank you audience across the world for celebrating it even more than we did. Seeing all your unconditional warmth leaves me speechless.
To all my FANS who always stand by me and keep giving me that energy, I feel truly blessed. Your unwavering support is the reason I push myself beyond limits. I carry each of your love-filled cheers and words of encouragement in my heart. It's your belief in me that gives me strength, and for that, I am forever indebted. You are the reason this journey is meaningful and I promise to keep giving my best for you. Thank you for carrying it on your shoulders and making 'DEVARA part 1' a huge success and a remarkable blockbuster."
Thanking you-NTR
‘దేవర’ను బ్లాక్ బస్టర్ సక్సెస్ చేసినందుకు అభిమానులు, బృందం, ప్రేక్షకులు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లకు కృతజ్ఞతలు తెలిపిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర సెప్టెంబర్ 27 విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. కొరటాల శివ తెరకెక్కించిన దేవర చిత్రానికి ఆడియెన్స్ మరుపురాని హిట్‌ను అందించారు. సైఫ్ అలీ ఖాన్ భైరాగా, జాన్వీ కపూర్ ఫీమేల్ లీడ్‌గా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌ల మీద కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మించారు. దేవర మూవీ క్వాలిటీ, నిర్మాణ విలువలు, ఆకర్షణీయమైన కథనం, ప్రచార కార్యక్రమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్‌ను సాధించాయి.
500 కోట్లకు పైగా వసూలు చేసి గణనీయమైన లాభాలను ఆర్జించింది. ఈ అద్భుతమైన విజయం ఎన్టీఆర్‌కు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఈ అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు, అభిమానులకు, చిత్ర బృందానికి, మీడియాకు ఎన్టీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్‌లో నటుడు సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ వంటి వారు పాత్రలకు ప్రాణం పోయడం, దర్శకుడు కొరటాల శివ తన అద్భుతమైన విజన్, టీమ్ పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చిందని అన్నారు. దేవర కోసం పని చేసిన సాంకేతిక నిపుణులను ఎన్టీఆర్ అభినందిస్తూ.. సినిమా విజయవంతమవడానికి అవసరమైన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను అభినందించారు. సినిమా విజయానికి ముఖ్య సహకారం అందించిన నిర్మాతలు సుధాకర్ మిక్కిలినేని, హరికృష్ణ కొసరాజులకు కృతజ్ఞతలు తెలిపారు. అతను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులకు, సినిమాను ఆస్వాదించిన ప్రేక్షకులకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
‘దేవర పార్ట్ 1కి వచ్చిన ఆదరణ, కురిపిస్తున్న ప్రేమను చూసి నాకు ఎంతోగానో సంతోషం వేస్తోంది. ఈ చిత్రం నాకు ఎంతో ప్రత్యేకమైంది. ఇంత స్పెషల్ అయిన చిత్రానికి మీ అందరూ ప్రేమను, సపోర్ట్‌ను ఇచ్చి బ్లాక్ బస్టర్ చేయడం చూసి మరింత ఆనందం వేస్తోంది. నా సహ నటులు సైఫ్ అలీ ఖాన్, జాన్వీ, ప్రకాష్ రాజ్ గారు, శ్రీకాంత్ గారు సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. పాత్రలకు ప్రాణం పోసిన ఆర్టిస్టులందరికీ థాంక్స్. ఇంత గొప్ప ప్రపంచాన్ని క్రియేట్ చేసిన కొరటాల శివ గారికి థాంక్స్. ఆయన నాయకత్వం, దర్శకత్వంతో దేవర విజన్ రియాల్టీలోకి వచ్చింది.
అనిరుధ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దేవర చిత్రానికి ఆయన బ్యాక్ బోన్‌లా నిలబడ్డారు. రత్నవేలు సర్ ప్రతీ ఫ్రేమ్‌ను అద్భుతంగా తీర్చి దిద్దారు. సాబు సిరిల్ సర్ అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్, యుగంధర్ గారి వీఎఫ్ఎక్స్, శ్రీకర్ ప్రసాద్ గారి ఎడిటింగ్ ఇలా అందరూ కలిసి దేవరను ఓ అద్భుతంగా మార్చారు.థియేటర్లో ఇంత బాగా సక్సెస్ అవ్వడానికి కారణమైన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు థాంక్స్. ఇంతగా సపోర్ట్ చేసిన ఇండస్ట్రీకి థాంక్స్. దేశ వ్యాప్తంగా దేవరను ఇంత బాగా కవర్ చేసిన మీడియాకు థాంక్స్. నా నిర్మాత సుధాకర్ మిక్కిలి సుధాకర్ గారికి థాంక్స్.
ఈ ప్రాజెక్ట్ ప్రారంభం అవ్వడానికి ఇంత బాగా రావడానికి కారణమైన హరికృష్ణ కొసరాజు గారికి థాంక్స్. మా కంటే ఈ సినిమాను ఎక్కువగా సెలెబ్రేట్ చేసిన ప్రపంచ వ్యాప్తంగా అభిమానులకు, సినిమా ప్రేక్షకులకు థాంక్స్. మీ ప్రేమాభిమానాలను చూసి నా నోట మాట రాలేదు. నా వెన్నంటే ఉంటూ నాకు అంతులేపి ప్రేమను, సపోర్ట్ ఇస్తున్న నా అభిమానుల రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను. మీరు చూపించే ప్రేమ వల్లే నేను ఈ స్థాయికి చేరుకోగలిగాను. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకమే నాకు ఎప్పుడూ ధైర్యాన్ని, శక్తిని ఇస్తుంటుంది. మీకు నేను ఎప్పటికీ రుణపడే ఉంటాను. మీ అందరినీ గర్వపడేలా చేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాను. దేవర పార్ట్ 1ను మీ భుజానికి ఎత్తుకుని ఇంత పెద్ద ఘన విజయాన్ని అందించినందుకు థాంక్స్’ అని ఎన్టీఆర్ అన్నారు.
- థాంక్స్ ఎన్టీఆర్