Making of Sabarimala Ayyappa Swamy Prasadam Aravana
ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ముందుగా రెడ్ రైస్ తీసుకోవాలి మీరు ఏ బౌల్ అయినా ఇంట్లో కొలత కింద తీసుకోవచ్చు అయితే అన్ని ఇంగ్రిడియంట్స్ అదే బౌల్ తో కొలుచుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ ఒక బౌల్ దాకా రెడ్ రైస్ తీసుకుంటున్నాను ఈ రైస్ మీకు ఏ సూపర్ మార్కెట్స్ లో అయినా ఈజీగా దొరికేస్తుంది.రైస్ ని బౌల్ లో వేసుకున్న తర్వాత బాగా రెండు మూడు సార్లు కడిగేసేయండి కడిగేసేసి ఒక పక్కన పెట్టుకోండి ఈ రైస్ ని మనం నానబెట్టాల్సిన పని లేదు.
ఇలా వాష్ చేసుకున్న బియ్యాన్ని స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులోకి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకుని ఆ నేతిలో మనం కడిగి పెట్టుకున్న ఈ రెడ్ రైస్ ని వేసి దోరగా వేయించండి మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక ఐదు నిమిషాలైనా వేయించాలి దోరగా కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో మనం ఏ బౌల్ తో అయితే రైస్ తీసుకున్నామో అదే బౌల్ తో మూడు బౌల్స్ దాకా నీళ్లు పోసుకోండి ఇదే ప్రాసెస్ ని మీరు ప్రెజర్ కుక్కర్ లో కూడా చేసుకోవచ్చు ప్రెజర్ కుక్కర్ లో అయితే ఈజీగా త్వరగా రైస్ కుక్ అయిపోతుంది నేను ట్రెడిషనల్ మెథడ్ చెప్తున్నాను మూడు బౌల్స్ దాకా నీళ్లు వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కదుపుకుంటూ మూత పెట్టుకుంటూ రైస్ ని చక్కగా కుక్ చేసుకోవాలి.
ఈ బియ్యం ఉడికే లోపు ఈ రెసిపీ కోసం ఖచ్చితంగా తాటి బెల్లాన్ని అయితే తీసుకోవాలి తాటి బెల్లంతోనే మీకు అయ్యప్ప స్వామి ప్రసాదం అనేది ఎగ్జాక్ట్ టేస్ట్ వస్తుందన్నమాట తాటి బెల్లాన్ని నేను 1/2 kg దాకా తీసుకున్నాను బెల్లాన్ని సన్నగా తురుముకుని బౌల్స్ తో కొలుచుకోండి మనం ఏ బౌల్ తో రైస్ తీసుకున్నామో అదే బౌల్ తో మూడు బౌల్స్ దాకా రావాలి ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి ముప్పావు కప్పు దాకా నీళ్లు వేసుకోండి నీళ్లలోకి మనం తురుముకున్న బెల్లాన్ని మూడు బౌల్స్ వేసుకోండి సో కొలుచుకుని బెల్లం తురుము వేసుకోండి బెల్లం అంతా పూర్తిగా కరిగేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి గరిటతో కలుపుతూ బెల్లాన్ని కరగబెట్టుకోండి ఈ తాటి బెల్లంలో కొద్దిగా ఇంప్యూరిటీస్ అనేవి ఉంటాయి సో ఈ బెల్లం వాటర్ ని కచ్చితంగా మనం ఫిల్టర్ చేసుకోవాలి అందుకనే బెల్లాన్ని కరిగిస్తున్నాం బెల్లం అనేది పూర్తిగా కరిగితే సరిపోతుంది పాకం లాంటివి రానవసరం లేదు ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయాక స్టవ్ ఆపేసేసి ఈ గిన్నెని పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు మనం ఉడికిస్తున్న రైస్ ని చూద్దాము రైస్ అనేది ఈ విధంగా ఉడకాలన్నమాట అంటే మరీ మెత్తగా మనం అన్నం ఉడికించుకున్నంత సాఫ్ట్ గా కాకుండా లైట్ పలుకు ఉండాలి బట్ చేత్తో నొక్కితే మెత్తగా నలగాలి సో అన్నం చక్కగా కుక్ అవ్వాలి కానీ గ్రైండ్స్ కింద ఉండాలి అన్నం సరిగ్గా ఉడకకపోతే బెల్లం పాకంలో ఉడికినప్పుడు రైస్ అనేది బాగా గట్టిగా అయిపోతుందండి ఓవర్ గా కుక్ చేస్తే అయ్యప్ప స్వామి ప్రసాదం టేస్ట్ టెక్చర్ రాదు మీరు ఈ ప్రసాదాన్ని తినేటప్పుడు మీకు మధ్య మధ్యలో అన్నం పలుకులు తగులుతూ ఉంటాయి కదా దానికి కారణం ఇదే అన్నమాట సో ఇలా ఉడికించుకున్న అన్నంలోకి మనం కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్ మొత్తాన్ని కూడా ఫిల్టర్ చేసి ఇందులోకి కలిపేసేయండి బెల్లం వాటర్ వేసిన తర్వాత కాస్త పల్చన అవుతుందండి మంటని మీడియం టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ అడుగు పట్టకుండా మాడిపోకుండా గరిటతో కలుపుతూ కాస్త చిక్కబడనివ్వాలి ఇలా దగ్గర పడేటప్పుడే.
ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు అలాగే నల్ల ద్రాక్ష ఉంటుంది కదండీ ఎండు ద్రాక్ష అది కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఇందులో వేసేసేయండి వీటిని మీరు నేతిలో వేసి వేయించి ఇందులో వేయకూడదు ఇలా డైరెక్ట్ గా ఇందులోనే వేసేస్తే అన్నంతో పాటుగా పాకంలో ఉడికి మంచి టేస్ట్ వస్తుంది ఇలా ఉడికించేటప్పుడు మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నెయ్యిని వేస్తూ ఉడికించండి నేను టోటల్ గా త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యిని అయితే వాడాను అయితే ఇక్కడ మీరు ఆవు నెయ్యి వాడితే ఇంకా శ్రేయస్కరం 15 నుంచి 20 నిమిషాల పాటు ఇలా స్లోగా కుక్ చేస్తూ ఉంటే గనుక ఇది కాస్త చిక్కబడుతుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఒక టీ స్పూన్ దాకా డ్రై జింజర్ పౌడర్ సొంటి పొడి వేసుకోవాలి సొంటి పొడి తో పాటుగా ఒక టీ స్పూన్ దాకా యాలకుల పొడి అలాగే జస్ట్ చిన్న ముక్క చిటికెడు అంత పచ్చ కర్పూరం కూడా వేసుకుని బాగా కలిపేసేయండి మరొక 10 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేయండి.
మీరు చేతి వేళ్ళ మధ్య పెడితే ఇలా చక్కగా చిక్కటి తీగ పాకం రావాలి ఇలా వస్తే కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట ఇప్పుడు స్టవ్ ఆపేసేసి కడాయిని పక్కకు దించుకుని చల్లారాక సర్వ్ చేసుకోవడమే ఇది ఉడికేటప్పుడే మీకు ఆ స్మెల్ టేస్ట్ తెలిసిపోతుంది అండ్ ఈ ప్రసాదాన్ని మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే నెల రోజుల పాటు తినొచ్చు.